Mamata Banerjee: మీరు మా వాళ్లను నలుగుర్ని లోపలేస్తే, నేను 8 మందిని జైలులోకి పంపుతా.. బీజేపీకి దీదీ వార్నింగ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బీజేపీకి బెంగాల్ సీఎం, తృణమూల్ సుప్రీమో మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన నలుగురిని కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేశాయని, రాష్ట్ర పోలీసులు ఇందుకు ప్రతిగా 8 మంది బీజేపీ నాయకులను జైలులో పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.
‘‘మీరు ఈ రోజు నవ్వుతున్నారు, ఎందుకంటే మా పార్టీ నేతలు అనుబ్రత మోండోల్, పార్థ ఛటర్జీ, మాణిక్ భట్టాచార్య, జ్యోతి ప్రియా మల్లిక్ మరియు మరికొంత మంది నాయకులు జైలులో ఉన్నారు. ఈ సంప్రదాయం కొనసాగుతుంది. భవిష్యత్తులో మీరు కుర్తీలో లేనప్పుడు ఎక్కడ ఉంటారు..? జైలులో’’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
Read Also: Jammu Kashmir: రాజౌరీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ముగ్గురు జవాన్ల వీరమరణం..
కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామని అనుకుంటున్నారని, మీరు టీఎంసీ నాయకులను, అరవింద్ కేజ్రీవాల్, అశోక్ గెహ్లాట్ కుమారుడిని ఇతర నాయకులపై ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అదే అధికారులు మీ వెంట పడతారని, మిమ్మల్ని ఎవరూ రక్షించలేరని ఆమె అన్నారు.
ప్రస్తుతం 2024 ఎన్నిలక ముందు వరకు ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుంటున్న కేంద్ర ఏజెన్సీలు, ఆ తర్వాత బీజేపీ వెంట పడుతాయని ఆమె అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రిజర్వేషన్లు తొలగించాని కోరుకుంటోందని, దానిని వ్యతిరేకిస్తామని, మైనారిటీ రిజర్వేషన్లకు కూడా బీజేపీ వ్యతిరేకమని ఆరోపించారు. మెట్రో రైలు నుంచి క్రికెట్ వరకు అన్నింటిని బీజేపీ కాషాయికరణ చేయాలనుకుంటోందని మండిపడ్డారు. క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాషాయం జెర్సీని ధరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్‌లో కాకుండా కోల్‌కతా, ముంబైలో జరిగితే మనం గెలిచే వాళ్లమని, పాపులు హాజరైన మ్యాచ్ మినహా అన్ని మ్యాచుల్ని గెలిచామని పరోక్షంగా ప్రధానిని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.
- Tags
- bjp
- CBI
- ED
- Mamata Banerjee
- TMC
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!