IT Returns Refund: ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా.. రెండు నెలలు దాటినా ఇంకా మీకు ఐటీఆర్ రీఫండ్ కాలేదా.. అయితే కొన్ని కారణాల వల్ల మీకు ఐటీఆర్ రీఫండ్ కాకపోవచ్చు. ఆ కారణాలేంటో ముందు తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఐటీఆర్ రీఫండ్‌కు మీరు అర్హులేనా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకోసం ఐటీఆర్‌ను ఆదాయపు పన్నుశాఖ ప్రాసెస్ చేసిందా లేదా చూడాలి. ఒకవేళ రీఫండ్‌కు మీరు అర్హులు అని ఐటీశాఖ ధ్రువీకరిస్తేనే మీరు మెన్షన్ చేసిన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో స్టేటస్ చూసుకోవాలి. స్టేటస్‌లో ‘నో రికార్డ్స్ రీఫండ్’ అని చూపిస్తుంటే ఐటీ శాఖ మీ వివరాలను ఇంకా పెట్టలేదని అర్ధం చేసుకోవాలి. ఒకవేళ స్టేటస్‌లో రీఫండ్ ఇష్యూ అని చూపిస్తే మాత్రం మోడ్ ఆఫ్ పేమెంట్, అమౌంట్, డేట్ ఆఫ్ క్లియరెన్స్ వంటి వివరాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also:ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలివే!
అయితే కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ స్టేటస్‌లో ‘రీఫండ్ ఫెయిల్డ్’ అని కనిపిస్తుంది. అందుకు తగ్గ కారణాలను కూడా అక్కడ పొందుపరుస్తారు. ఈ కారణాలను మీకు ఈ-మెయిల్ కూడా వస్తుంది. ఐటీఆర్ రీఫండ్ ఫెయిల్ అయితే.. రీ ఇష్యూ కోసం ఐటీశాఖకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఒక్కోసారి స్టేటస్‌లో ‘రీఫండ్ కెప్ట్ ఆన్ హోల్డ్’ అని కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ మెయిల్‌కు వస్తాయి. బ్యాంకు ఖాతా వాలిడేట్ చేసే సమయంలో లోపాలు ఉండొచ్చు. లేదా బ్యాంకు ఖాతాకు పాన్ లింక్ అయ్యి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్ రీఫండ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. రీఫండ్ ట్రాకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.