Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్‌టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అగ్రిమెంట్‌తో రెండు దేశాల్లోనూ మరింత మంది ఉద్యోగాలు పొందుతారని, గ్రోత్ సాధ్యమవుతుందని, మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ ల్యాబ్
డిజిటల్ మార్కెటింగ్ మరియు యాడ్ టెక్ సర్వీసులను అందిస్తున్న బ్రైట్‌కామ్ గ్రూప్ హైదరాబాద్‌లో క్వాంటం కంప్యూటింగ్ ఇన్నోవేషన్ ల్యాబ్‌ని ఏర్పాటుచేయనుంది. క్వాల్యాబ్జ్ ఇంక్‌తో కలిసి సిమ్యులేటర్లను, ఇతర ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తేనుంది. క్వాంటం కంప్యూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఈ గ్రూపు గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్వాల్యాబ్జ్ ఇంక్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, NLP, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం AI వంటి రంగాల్లో నైపుణ్యాలను సాధించింది.
Jogi Ramesh: అది ప్రతిపక్షం కాదు.. పనికిరాని పక్షం
2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు
2030 నాటికి ఇండియా ఫిన్‌టెక్ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరనుందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2022లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో పెట్టుబడులు ఇన్సూర్‌టెక్, వెల్త్‌టెక్ తదితర సెక్టార్లకు సమానంగా పంపిణీ అవుతాయని తెలిపారు. భవిష్యత్‌లో ఫిన్‌టెక్ రంగంలో MSMEలకు అకౌంట్ అగ్రిగేటర్, UPI మరియు ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్డ్ నెట్‌వర్క్ ద్వారా నగదు ప్రవాహం పెరగనుందని చెప్పారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఇవాళ స్టాక్ మార్కెట్లు అత్యంత స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత కాసేపటికే కొద్దిపాటి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 59701 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17772 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్‌టెల్, ఐటీసీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. బంగారం కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. సిల్వర్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. 187 పాయింట్లు లాభపడింది. రూపాయి విలువ 9 పైసలు తగ్గి 79.61 వద్ద నిలకడగా ఉంది.