Three Wheels Electric Car: ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది. అయితే ఈ కారుకు మూడు చక్రాలు మాత్రమే ఉండనున్నాయి. స్ట్రోమ్ 3 పేరుతో విడులవుతున్న ఈ కారు ధర కూడా తక్కువే ఉంటుందని తెలుస్తోంది. డైమండ్ కట్ ఆకారంతో కొత్త డిజైన్‌తో విడుదల కానున్న ఈ కారుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కారులో ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. అంతేకాకుండా కంపెనీ ఇందులో సన్‌రూఫ్‌ను కూడా ఇచ్చింది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. ఈ వాహనాన్ని సిటీలలో నడపటం సులభమని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.
Read Also: Flying Cars: ఎగిరే కార్లు వస్తున్నాయి.. విజయవంతంగా పరీక్షించిన చైనా..
ఈ కారు ధర రూ.4.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ కారులోని 48 వోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ 15 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కారు టార్క్ 90 Nm ఉంటుంది. మూడు గంటల్లో పూర్తిగా చార్జింగ్ అయి 200 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. కారు గరిష్ట వేగం 80 కి.మీ. వరకు ఉంటుంది. కాగా ప్రస్తుతం ఈ కారు కోసం బుకింగ్‌లు నడుస్తున్నాయి. ఆసక్తి గల వారు రూ.10వేలు చెల్లించి స్ట్రోమ్ కంపెనీ అధికారిక సైట్‌లో ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో బుకింగ్‌లు ప్రారంభించిన తర్వాత కేవలం 4 రోజుల్లోనే రూ.750 కోట్ల విలువైన వాహనాలు బుక్ అయ్యాయని స్ట్రోమ్ పేర్కొంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఈ కారు తొలుత అందుబాటులోకి రానుంది.