Sampradayini Suppini Suddapoosani: నవ్విస్తూనే ఆసక్తి పెంచేసిన ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ట్రైలర్ ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన భార్య ఉత్తరగా డిఫరెంట్ పాత్రలో లయ నటించారు.
Also Read:Tollywood : పవర్ ఫుల్ క్యారెక్టర్స్‌తో వస్తున్న సీనియర్ హీరోలు
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఎంతో అమాయకంగా, సాంప్రదాయబద్ధంగా జీవించే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా కొన్ని విచిత్రమైన, ఊహించని నేరాల్లో ఎలా ఇరుక్కుంది..? దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి..? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ కథను నడిపించినట్లు అర్థమవుతోంది. క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్‌కు రంజిన్ రాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను మార్చి 6, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, మాస్టర్ రోహన్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ కామెడీ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!