Star Bucks: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్, గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్‌గా షాంతను నారాయణ్ నియమితులయ్యారు. తాజాగా ప్రపంచంలో అత్యధిక కాఫీ షాపులు కలిగి ఉన్న అమెరికా దిగ్జజం స్టార్ బక్స్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్‌కు చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. ఆయన ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ…
India's Good News to World: ప్రపంచంలోనే ఎక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తున్న మన దేశం వచ్చే సీజన్ నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండు విడతల్లో విదేశాలకు ఎగుమతులు చేయనుంది. ఇటు రైతులు.. అటు వినియోగదారులు.. ఇద్దరి ప్రయోజనాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ చేదు అనుభవం ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించనుంది. షుగర్ ఎక్స్‌పోర్ట్‌లపై ప్రస్తుత సీజన్లో కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై తగ్గి ధరలు పెరిగాయి.
Gold Rates: దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 540 తగ్గి రూ.50,730కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.46,500 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా నమోదు కాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,700గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి…
Disney Follows Amazon Prime: అమేజాన్ ప్రైమ్ మాదిరిగానే డిస్నీ కస్టమర్లకి కూడా త్వరలో డిస్నీ ప్రైమ్ అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సబ్స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌తోపాటు డిస్నీ ప్రైమ్ కూడా ఆరంభమైతే బ్రాండెడ్ మర్చెండైజ్లు, థీమ్ పార్క్‌లు, ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు ప్రకటించనుంది. అమేజాన్ ప్రైమ్‌ని స్ఫూర్తిగా తీసుకొని డిస్నీ ఎగ్జ్క్యూటివ్లు ఈ కొత్త ప్రణాళికను రచించారు.
Increase Credit: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. క్రెడిట్ గ్రోత్‌ను మరింత పెంచాలని, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ల స్థితిగతుల పైన కూడా ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించటంపై ఆసక్తితో ఉన్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.
NPAs may Increase: ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ అండ్ ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎంఎస్ఎంఈలతోపాటు ఏవియేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, పవర్, రిటైల్ ట్రేడ్ వంటి రంగాలకు కూడా ఈ ప్రమాదం ఎదురుకానుందని స్టడీలో పాల్గొన్న బ్యాంకులు పేర్కొన్నాయి.
NTV Business ICONS Exclusive Interview: 'కలారి క్యాపిటల్' ఫౌండర్ వాణి కోలా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. మన దేశ వ్యాపార రంగంలో వాణి కోలా అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరు. వెంచర్ క్యాపిటలిజానికి మార్గదర్శకురాలిగా పేరొందారు.
Mukesh Ambani statement on Jio 5G: హైస్పీడ్ 5జీ స్పెక్ట్రం సర్వీసులను ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి తేనున్నట్లు రిలయెన్స్ జియో సంస్థ ప్రకటించింది. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయెన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆన్లైన్లో జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన కంపెనీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
Top Five Software Companies in the World: మనకు పలు సాఫ్ట్వేర్ కంపెనీల పేర్లు, వాటి అధిపతుల గురించి తెలిసి ఉండొచ్చు. కానీ.. ప్రపంచంలోని టాప్ ఫైవ్ సాఫ్ట్వేర్ సంస్థలేవి అంటే మాత్రం సరిగ్గా ఆన్సర్ చెప్పలేం. ఈ ప్రశ్నకు ఠక్కున సమాధానం కావాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఈ చిన్న వీడియో చూస్తే సరిపోతుంది. ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న ఐదు సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి సీఈఓల పేర్లు, ప్రధాన కార్యాలయం ఉన్న ప్ర'దేశం', రెవెన్యూ,…