Tollywood : పవర్ ఫుల్ క్యారెక్టర్స్‌తో వస్తున్న సీనియర్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా టర్న్ తీసుకుని తానేంటో ఫ్రూవ్ చేసుకున్న హీరో మోహన్ బాబు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సీనియర్ హీరో కెరీర్ ప్రజెంట్ డల్‌గా కొనసాగుతోంది. ఎప్పుడో సైడ్ రోల్స్‌కు షిఫ్టైనా .. అప్పుడప్పుడు హీరోగానూ, నిర్మాతగానూ ప్రయత్నాలు ఆపడం లేదు. కానీ అవేమీ వర్కౌట్ కావట్లేదు. ఇక మోహన్ బాబు కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో పవర్ ఫుల్ క్యారెక్టర్స్‌తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు వస్తున్నారు.
Also Read : ViRosh : విరోష్.. రిసెప్షన్ కు వారికి నో ఎంట్రీ..
Also Read
నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న హై ఆక్డేన్ మూవీలో మోహన్ బాబు యాంటోగనిస్టుగా కనిపించబోతున్నారు. శిఖంజ మాలిక్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నాడు శ్రీకాంత్. ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేసింది. అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న శ్రీనివాస మంగాపురంలో వెంకటప్ప నాయుడిగా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాతో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ కాబోతుంది. ఇందులో రాషాకు తండ్రిగా కనిపించబోతున్నారట మోహన్ బాబు. వన్స్ ఆపాన్ ఎ టైం బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. టాప్ హీరోగా మారిన రాజశేఖర్ కెరీర్ ప్రజెంట్ డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత సీనియర్ హీరో నుండి 2.0 వర్షన్ చూస్తామనుకుంటే గ్రాఫ్ మరింత డౌన్ అయ్యింది. పోనీ శ్రీకాంత్, జగపతిబాబులా విలన్ క్యారెక్టర్స్‌కు షిఫ్ట్ కాలేకపోతున్నాడు. అప్పుడప్పుడు తనలోని హీరోను బయటపెడుతూ.. అడపా దడపా స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు రాజశేఖర్ . 2023లో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో స్పెషల్ రోల్ చేసిన రాజశేఖర్ ఆ తర్వాత కనిపించలేదు.
శర్వానంద్ అప్ కమింగ్ ఫిల్మ్ బైకర్‌లో కీ రోల్ చేస్తున్నాడు రాజశేఖర్. గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్నికారణాలు చెప్పి.. వాయిదా వేసింది. రీసెంట్లీ నయా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ రాజశేఖర్ క్యారెక్టర్ రివీల్ చేసింది. బుల్లెట్ సునీల్ అనే వపర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు రాజశేఖర్. మాజీ బైక్ రైసర్‌గా, శర్వాకు ట్రైనర్‌గా కనిపించబోతున్నాడు సీనియర్ హీరో. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతుంది. మరీ ఈ సినిమాలైనా మోహన్ బాబు, రాజశేఖర్‌లను బిజీ చేస్తాయోమో లెట్స్ వెయిట్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు