IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ…
Startups Achieved Unicorn Status: ఇండియన్ యూనికార్న్ క్లబ్లో ఈ ఏడాది కొత్తగా 20 స్టార్టప్‌లు చేరాయి. దీంతో ఇండియన్ యూనికార్న్‌ల మొత్తం సంఖ్య 106కి పెరిగింది. వీటన్నింటి అంచనా విలువ 343 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో 94 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ని ఈ స్టార్టప్‌లు బయటి సంస్థల నుంచి రైజ్ చేయటం విశేషం.
Special Story on Jio Super Success Journey: ప్రస్తుతం మన దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్ జియో అనే సంగతి అందరికీ తెలిసిందే. జియో పూర్తి పేరు 'జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆపర్చునిటీ'. ఈ కంపెనీ 2016లో ప్రారంభమైంది. లాంఛ్ అయిన రెండేళ్లలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా ఎదిగింది. రిలయెన్స్ జియోని ప్రారంభించాలనే ముఖేష్ అంబానీ ఆలోచనకు మూలకారణం ఆయన కూతురు ఇషా అంబానీ. కాలేజీ అసైన్మెంట్ సబ్మిట్ చేసే సమయంలో డేటా స్లోగా ఉండటం…
NTV Business Exclusive Interview Promo With Vani Kola. Watch Full Interview On 29th August: వాణీ కోలా. కలారి క్యాపిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఫార్చ్యూన్ ఇండియా నిర్వహించిన సర్వేలో మన దేశ వ్యాపార రంగంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. ఇండియన్
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్‌లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్‌లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.
Central Governement: దేశంలోని వంటనూనె తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వంటనూనెలను ప్యాకింగ్ చేసే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉందనే వివరాలు ఇవ్వడానికి బదులుగా ప్యాకెట్ లేదా సీసాలో ఎంత నూనె ఉందో తెలిపే ఘనపరిమాణం, బరువు వివరాలను ముద్రించాలని వంటనూనెల తయారీ కంపెనీలు, ప్యాకర్లు, దిగుమతిదార్లను కేంద్రం ఆదేశించింది. తూకం విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వివరించింది. వివరాల ముద్రణలో ఈ మార్పులు చేపట్టేందుకు…
American Express Credit Cards: కొత్త క్రెడిట్ కార్డులను జారీచేయకుండా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై విధించిన నిషేధాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. లోకల్ డేటా స్టోరేజ్ రూల్స్ పాటించట్లేదనే కారణంతో 2021 ఏప్రిల్‌లో నిషేధం విధించిన ఆర్బీఐ 15 నెలల అనంతరం నిన్న అనుమతించింది.
Investment-Profit: జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన ఈ రెనివబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తేనుంది.
IT Slow Growth: మన దేశం చేస్తున్న ఏకైక అతిపెద్ద ఎగుమతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసులు. విదేశీ మారకానికి కూడా ఇదే కీలకమైన సోర్స్. కానీ ఐటీ ఇండస్ట్రీ ఈ మధ్య ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. దీంతో ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది.
Mobile Prices: మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవాళ్లకు చేదువార్త అందింది. దేశవ్యాప్తంగా త్వరలోనే మొబైల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొబైల్ డిస్ప్లేకు అనుసంధానించే స్పీకర్లు, సిమ్ ట్రేలు, పవర్ కీల దిగుమతులపై 15% సుంకం విధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్& కస్టమ్స్(CBIC) ప్రకటించింది. ఈ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్మార్ట్ఫోన్ల ధరలు పెరగనున్నాయి. చాలా కంపెనీలు ఇండియాలోనే స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నప్పటికీ విడిభాగాలను మాత్రం…