Business Today: ‘సన్ ఫ్లవర్’ దిగుమతి.. హైదరాబాద్ సంస్థ రికార్డ్: 2020-21 ఆర్థిక సంవత్సరంలో పొద్దుతిరుగుడు పువ్వు ముడి వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకున్న సంస్థగా హైదరాబాద్‌కి చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయంలో వరుసగా రెండోసారీ ఫస్ట్ ప్లేసులో నిలిచి అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి వెల్లడించారు.
GodFather-Bisleri: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ వాటర్ బాటిళ్లపై ఆ మూవీ బొమ్మతో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిళ్లపై గాడ్‌ఫాదర్ బొమ్మ గల లేబుళ్లను అతికించి అందుబాటులో ఉంచనున్నారు.
Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి.
Gold Supplying Banks: గోల్డ్ సప్లై బ్యాంక్‌లు ఇండియాకి షిప్మెంట్లను తగ్గించాయి. మన దేశానికి బదులుగా చైనా, టర్కీ మరియు ఇతర మార్కెట్లకు బంగరాన్ని తరలించాయి. ఇండియాలో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన కన్నా ఆయా దేశాల్లోనే బెటర్ ప్రీమియమ్ ఆఫర్లు ఉండటంతో అటు వైపు ఫోకస్ పెట్టాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ అయిన ఇండియాలో బంగారం కొరత నెలకొననుంది.
Gold Rates: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బులియన్ మార్కెట్లో బుధవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.47,350కి చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.51,660గా ఉంది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.4,200 పెరిగి రూ.66,700కి చేరింది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. Read…
Union Nari Shakti Scheme: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ నారీ శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలను మంజూరుచేసింది. దేశం మొత్తమ్మీద 10 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వాళ్ల అవసరాలను బట్టి లోన్ అమౌంట్‌ను నిర్ణయిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మినోచి…
Wind Man of India: సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థకు ఫౌండర్గానే కాకుండా ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా పేరొందిన తుల్సి తంతి కన్నుమూశారు. మన దేశంలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఈయన కూడా ఒకరు కావటం చెప్పుకోదగ్గ విషయం. తుల్సి తంతి క్లీన్ ఎనర్జీ సెక్టార్లో సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం విశేషం. సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 8 వేల 5 వందల 35 కోట్ల రూపాయలకు పైగా…
House EMI: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేటును సమీక్షించిన కొద్ది గంటల్లో పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచేశాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ అరశాతం పెంచింది. దీంతో సామాన్యులకు మరో షాక్ తగిలినట్లు అయ్యి్ంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు…
Hero Ramcharan for Hero Company: హీరో మోటోకార్ప్ సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటుడు రాంచరణ్తేజ్ని నియమించుకుంది. గ్లామర్ ఎక్స్‌టెక్ అనే మోడల్‌కి ఆయన ప్రచారం చేస్తారు. బైక్ స్టైల్, సేఫ్టీ మరియు పెర్ఫార్మెన్స్కి హీరో రాంచరణ్ సింబాలిక్‌గా నిలుస్తారని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇదిలాఉండగా.. హీరో కంపెనీతో కలిసి పనిచేయనుండటం, గ్లామర్ ఎక్స్‌టెక్ గురించి తన ద్వారా మరింత మందికి తెలియనుండటం పట్ల రాంచరణ్‌తేజ్ సంతోషం వ్యక్తం చేశారు.
SAIL Entered Trillion Club: లక్ష కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన ఎలైట్ క్లబ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ జాబితాలోకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలిసారిగా చేరింది. 2021-22 మధ్య కాలంలో 18.73 మిలియన్ టన్నుల హాట్ మెటల్ని మరియు 17.36 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌ని ఉత్పత్తి చేసింది. ఈ సంస్థకు సంబంధించి ఇదే ఇప్పటివరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావటం గమనించాల్సిన అంశం.