Swiggy: దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కొటిగా ఉద్యోగాల కోతతో వార్తల్లో నిలుస్తు్న్నాయి. స్టార్టప్ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి బడా సంస్థలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇప్పుడు తామూ ఇదే ట్రెండ్ ఫాలో అవ్వబోతున్నామంటూ ముందుకొచ్చింది ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 6వేల మందిలో దాదాపు 8-10 శాతం ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్ట్, ఇంజినీరింగ్‌తో పాటు ఆపరేషన్ విభాగాల్లో ఈ కోతలు ఉండబోతున్నాయట.
Read Also: Driving Skills: వీడి డ్రైవింగ్ వేరే లెవల్.. నిపుణుల పర్యవేక్షణలోనే ఇలాంటివి చేయాలి
ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించిన కంపెనీ ఉద్యోగులకు 0-5 రేటింగ్ కూడా ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ఇందులో 2 నుంచి దానికి తక్కువ రేటింగ్ ఉన్నవారిని వారి పనితీరు మెరుగుపర్చుకునే అవకాశం ఇచ్చారని తెలిసింది. ఆర్థిక మాంద్యం భయాలతో పాటు ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లో ఉంచేందుకు స్విగ్గీ ఉద్యోగాల కోతకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు స్విగ్గీ నష్టాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2021లో రూ.1,617 కోట్లుగా ఉన్న నష్టాలు.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.3,628.90 కోట్లకు చేరాయి. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. స్విగ్గీ తన మార్కెట్ వాటాను జొమాటోకు కోల్పోతోందని బ్రోకరేజీ సంస్థ జఫ్రీచ్ గతంలో తెలిపిన విషయం విదితమే.
Read Also: Aruna Millar: అమెరికాలో తెలుగు వనితకు అరుదైన గౌరవం