బంగారం ధరలు సామాన్యులకు హడలెత్తిస్తున్నాయి. కొత్త సంవత్సరం రావడం, త్వరలో పెళ్లిళ్ళ సీజన్ కూడా ప్రారంభం కావడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి.రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960గా కొనసాగుతోంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960గా ఉంది.హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,400, విజయవాడలో కిలో వెండి ధర రూ.74,400గా ఉంది.