Rotten Coconut Business: బుర్రుండాలే కానీ.. తేలిగ్గా బిలియనీర్ కావొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rotten Coconut Business: డబ్బు ఎలా సంపాదించాలని చాలా మంది ఉన్న పనిని వదులుకుని టైం వేస్టు చేస్తూ అదేపనిగా ఆలోచిస్తుంటారు. కానీ ఆ టైంలో కొంచెం బుర్రకు పదును పెడితే కోట్టు సంపాదించే మార్గాలెన్నో ఉన్నాయి. కష్టించి పని చేస్తే ఏ వ్యాపారంలోనైనా లాభాలు గడించవచ్చని ఇప్పటికే ఎందరో నిరూపించారు. పనికిరావు.. అనుకున్న వాటితోనే కోట్లు సంపాదించి వావ్ అనిపించేశారు. అలాంటి ఓ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా కొబ్బరికాయ కుళ్లితే ఏం చేస్తాం.. డస్ట్ బీన్లో పడేస్తారు.. కానీ పాడైన కొబ్బరి కాయలతో కోట్లు సంపాదించొచ్చని మీకు తెలుసా. కుళ్లిన కురిడీల నుంచి తీసే నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తుంటే.. కుళ్లిన కాయలను కాశీలో శవాలను కాల్చేందుకు ఉపయోగిస్తున్నారని టాక్. గోదావరి జిల్లాల్లో కుళ్లిపోయిన కొబ్బరి కాయలతో రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. కోనసీమ కొబ్బరికాయలకు ఫేమస్. అక్కడి నుంచే పలు ప్రాంతాలకు కొబ్బరి కాయలు సరఫరా అవుతాయి.
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
Read Also: Health News: చలి అని ముసుగు తన్ని పడుకుంటే.. మీకు మూడినట్లే..?
అలా సరఫరాలో పగిలిన కొబ్బరికాయలను ఏరి పక్కన పడేస్తుంటారు వ్యాపారులు. వాటిని కొందరు రూపాయి, రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కుళ్లిన కొబ్బరి కాయలను ప్రాసెసింగ్, రవాణా చార్జీలతో కలిపి ఉత్తరాదిలో ఒక్కో కాయ రూ.8 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు. కుళ్లిన కొబ్బరి కాయల్లో వచ్చే కొబ్బరి గుజ్జును తీసి నాలుగైదు వారాలపాటు ఎండబెట్టి కొబ్బరి నూనె తీస్తారు. ఇలా తీసిన నూనె మార్కెట్లో రూ.30 నుంచి రూ.40 చొప్పున అమ్ముడుపోతుంది. కుళ్లిన కొబ్బరి కాయల చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ చిప్పలు టన్ను రూ.5 వేల ధర పలుకుతోంది.
Read Also: Plastic Waste: ఎక్కడ చూసినా చెత్తే.. ఇలాగే ఉంటే మన బతుకులు అంతే?
కాశీ వంటి క్షేత్రాల్లో కొబ్బరి కాయలతో అంత్యక్రియలు నిర్వహిస్తే పుణ్యం వస్తుందని ఉత్తరాది రాష్ట్రాల వారి నమ్మకం. శవాల దహనానికి కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి వినియోగిస్తున్నారు. కాయలను సంచులలో నింపి లారీల ద్వారా కాశీ, మధుర తదితర క్షేత్రాలకు ఎగుమతి చేస్తున్నారు. నాణ్యమైన కొబ్బరి కాయలు వినియోగించాలంటే కాయ రూ.20 పైనే ఉంటుంది. అంత ధర భారమనే ఉద్దేశంతో కుళ్లిన కొబ్బరి కాయలను శవ దహనానికి వినియోగిస్తున్నారని గోదావరి జిల్లాల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతిచేసే వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి రోజుకు మూడు లారీలు అంటే సుమారు లక్ష కాయలు. కాశీకి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతి అవుతున్నాయి. కార్తీక మాసంతో పాటు పూజల సమయాలలో హోమాల నిర్వహణ, మొక్కులు తీర్చుకునే క్రమంలో నదులలో వదిలేందుకు ఉత్తరాది భక్తులు ఈ కొబ్బరి కాయలను బస్తాల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి రెట్టింపు ధర పలుకుతున్నాయి. కుళ్లిన కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, చిప్పలు అన్నీ కలిపి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జరిగే లావాదేవీలు ఏటా రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!