Shiv Nadar: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సగటున రోజుకి 3 కోట్ల రూపాయలకు పైగా దానమిచ్చి మన దేశంలో అత్యధిక సంపదను పంచిపెట్టినవారి లిస్టులో టాప్‌లో నిలిచారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.1,161 కోట్లు డొనేట్ చేశారు. తద్వారా తాజాగా విడుదలైన ‘‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్-2022’’లో అగ్రస్థానాన్ని ఆక్రమించారు.
Indian Market: ఇండియన్ మార్కెట్ తమకెంతో ముఖ్యమని టర్కిష్ ఎయిర్‌లైన్స్ సీఈఓ బిలాల్ ఎక్సి అన్నారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ క్యారియర్ అయినప్పటికీ మన దేశంలో ఆ సంస్థ అభివృద్ధికి ప్రతిబంధకాలు ఉన్నాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కి ఇండియాలో ట్రాఫిక్ రైట్స్‌ని పరిమితంగా ఇవ్వటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నంబర్ వన్ ఎయిర్‌లైన్స్ ఇండిగోతో భాగస్వామ్యాన్ని బలపరచుకోవటం ద్వారా ఇండియన్ మార్కెట్లో షేర్ (బిజినెస్) పెంచుకోవాలని టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఆశిస్తోంది.
Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది.
Business Today: ఏపీలో బంగారం తవ్వకాల దిశగా..: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బంగారం తవ్వకాల దిశగా ఎప్పుడో విజయవంతంగా తొలి అడుగు వేసిన ఎన్ఎండీసీ.. ఇప్పుడు రెండో అడుగు కూడా ముందుకేసింది. మైనింగ్ లైసెన్స్ పొందేందుకు కన్సల్టెంట్ నియామకానికి తాజాగా తెర తీసింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. లైసెన్స్ లభిస్తే నాలుగేళ్ల నిరీక్షణ ఫలించినట్లవుతుంది.
Business Today: హైదరాబాద్ సిగలో మరో అంతర్జాతీయ కేంద్రం: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కి మరో ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఎంఎన్సీ రోషె ఫార్మా తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాన్ని గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పిలుస్తారు. షార్ట్ కట్లో ‘గేట్’ అని కూడా వ్యవహరిస్తారు.
Business Today: తెలంగాణకు 3, ఏపీకి 2 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభించిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 యూనిట్లు వచ్చాయి. ఇందులో తెలంగాణకు 3, ఆంధ్రప్రదేశ్‌కు 2 లభించాయి. తెలంగాణలో జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖమ్మంలోని సిటీ యూనియన్ బ్యాంక్ దీనికి ఎంపికయ్యాయి.
Idli ATM: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా డబ్బులు ఇచ్చే ఏటీఎంలను చూశాం.. వాటర్ ఇచ్చే ఏటీఎంలను చూశాం. కానీ ఎన్నో దిగ్గజ సంస్థలకు కేంద్రంగా మారిన బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇడ్లీ ఏటీఎం వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ ఏటీఎం మిషన్ సహాయంతో కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుంది. అంతేకాకుండా ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో ఇడ్లీ పార్సిల్ బయటకు వస్తుంది. అయితే ఈ ఇడ్లీ ఏటీఎం…
Reliance Jio: తన వినియోగదారులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, ప్రీమియం సబ్స్క్రిప్షన్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ అందించే రూ. 499, 601, 799, 1099, 333, 419, 583, 783, 1199 ప్లాన్లను రిలయన్స్ జియో తొలగించింది. అయితే ఈ నిర్ణయానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ డిస్నీ హాట్ స్టార్‌లో…
Rupee Value: అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. చమురు ధరలు, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం నాడు రూపాయి విలువ 82.33 నుంచి 82.66కు పడిపోయింది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డాలరు నిల్వలను ఖర్చు చేస్తూ రూపాయి పతనం కాకుండా జోక్యం…
Soaps Prices: ధరల భారంతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరట లభించింది. సబ్బులు, డిటర్జెంట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. ప్రొడక్ట్ బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. ముడిసరకు ధరలు అదుపులోకి రావడంతో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హిందూస్థాన్ యూనిలీవర్ విక్రయిస్తున్న సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 మిల్లీలీటర్ల…