Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల కష్టకాలం ఇంకా కొనసాగుతోంది. ఈ జనవరిలో మైక్రోసాఫ్ట్ ఏకంగా పది వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇళ్లకు పంపిన మైక్రోసాఫ్ట్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోతుంది.. ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నెలకోసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 75.9 కోట్ల మంది ( 52 శాతం ) ఇంటర్నెట్ వాడడం ఇదే తొలిసారి.
విద్య, జీవనోపాధి అవకాశాల కోసం ఒక సమగ్ర వేదిక ఫ్రీడమ్ యాప్ ధరల నమూనాలో గణనీయమైన మార్పును ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న కోర్సుల ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది.
దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కె.కృతివాసన్ను ఇన్చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
BMW New Car: ఊసరవెల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా అది ఎన్ని రంగులు మారుస్తుందో మనం వినే ఉంటాం. అయితే పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా. బీఎండబ్ల్యూ కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన కారు ఊసరవెల్లి తరహాలో రంగులు మారుస్తోంది. మీరు వింటుంది నిజమేనండోయ్. ఎందుకంటే బీఎండబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయమైన లుక్లో ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవర్ మూడ్కు అనుగుణంగా ఈ…
Swiggy: దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కొటిగా ఉద్యోగాల కోతతో వార్తల్లో నిలుస్తు్న్నాయి. స్టార్టప్ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి బడా సంస్థలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్లో మరోసారి ఉద్యోగాల కోత ఉండబోతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాక భారీగా ఉద్యోగుల్ని తొలగించగా..మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
GO First Airlines: ఇండియాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ గో ఫస్ట్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఎక్కడికైనా కేవలం రూ.1,199కే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు తక్కువ ధరకే అంతర్జాతీయ ప్రయాణం పొందవచ్చని సూచించింది. ఈ మేరకు రూ.6,599కే అంతర్జాతీయంగా విమాన టిక్కెట్లు పొందవచ్చని ట్వీట్ చేసింది. ఈ సేల్ ఈనెల 16 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటుందని.. ఈ టిక్కెట్లతో ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30…