మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రియల్ ఎస్టేట్ గ్రూప్ M3M డైరెక్టర్ బసంత్ బన్సల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బసంత్ బన్సాల్ సోదరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రూప్ కుమార్ బన్సాల్‌ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. M3M గ్రూప్ మరియు IREO గ్రూప్ ద్వారా 400 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఏజెన్సీ గుర్తించింది.
6 టాప్-10 అత్యంత విలువైన సంస్థల Mcap రూ. 1.13 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అందులో భారీగా లాభపడ్డ వాటిలో రిలయన్స్, హెచ్‌యుఎల్ ఉంది. మరోవైపు టాప్ 10 ప్యాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ గత వారం లాభపడ్డాయి.
గత కొన్ని వారాలుగా వారం వారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ.60,000 దిగువకు పడిపోయాయి.
న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో న్యూజిలాండ్ మాంద్యంలోకి జారిపోయింది. గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది.
ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి పడిపోయింది. రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల ఆర్థికవేత్తలు అంచనా వేసిన దానికి అనుగుణంగానే ఉంది.
బెంచ్‌మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు.
GST Collection: ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఇందుకు సంబంధించిన గణంకాలు అధికారికంగా వెల్లడించింది.
Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ దేశంలోనే పేర్గాంచిన ప్రసిద్ధ హాస్పిటల్ నెట్వర్క్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార కుటుంబం దీన్ని నడుపుతోంది. పైగా ఇది గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన కంపెనీ.
Alibaba New Jobs: రిట్రెంచ్‌మెంట్, ఆర్థిక మాంద్యం సమయంలో చైనా కంపెనీ ప్రజలకు గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఎక్కడికక్కడ కంపెనీలు నిరంతరం ఉద్యోగాల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి.