Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ భారీ పతనాన్ని కొనసాగించింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 502.5 పాయింట్లు క్షీణించి 63,546.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 159.55 పాయింట్ల నష్టంతో 18,962.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పడిపోయింది. 30-స్టాక్ ఇండెక్స్ గత ఆరు రోజులుగా అమ్మకాల ఒత్తిడిలో ఉందని, ఈ కాలంలో అది 3,000 పాయింట్ల పతనంతో 66,428 స్థాయి నుండి 63,403కి పడిపోయింది. ఈరోజు మార్కెట్ క్యాప్ రూ.3,04,28,059.59 కోట్లుగా మారింది. ఆరు రోజుల క్రితం మార్కెట్ క్యాప్ రూ.3,21,40,820.81 కోట్లుగా ఉంది. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.18 లక్షల కోట్లు నష్టపోయారు.
ఈ షేర్లలో క్షీణత
సెన్సెక్స్ కంపెనీల్లో టెక్ మహీంద్రా షేర్ దాదాపు మూడు శాతం పడిపోయింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం క్షీణించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్, టాటా మోటార్స్, నెస్లే, టైటాన్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ.5,864 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Read Also:David Warner-Glenn Maxwell: బీసీసీఐ సూపర్.. గ్లెన్ మాక్స్‌వెల్ వ్యాఖ్యలను ఖండించిన డేవిడ్ వార్నర్!
గ్లోబల్ మార్కెట్ క్షీణత
భారత స్టాక్ మార్కెట్‌తో పాటు ఇతర ఆసియా మార్కెట్లలో చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, జపాన్‌కు చెందిన నిక్కీ, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం ప్రతికూల ధోరణితో ముగిశాయి. విదేశీ నిధుల ఉపసంహరణ, ప్రపంచ మార్కెట్ల ప్రతికూల ధోరణి కారణంగా భారతీయ మార్కెట్ సెంటిమెంట్ కూడా ప్రభావితమైంది. గ్లోబల్ ఆయిల్ స్టాండర్డ్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.29 శాతం క్షీణతతో 89.87డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం రూ.4,236.60 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
భారత మార్కెట్ క్షీణతకు కారణాలు
1. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 20వ రోజుకు చేరింది. ఇప్పటికీ యుద్ధ నివారణకు తగిన పరిష్కారం లభించలేదు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఉద్రిక్తత పెట్టుబడిదారుల మనస్సులలో అనిశ్చితిని సృష్టించింది. ఇది స్టాక్ మార్కెట్లలో భయాందోళనలకు దారితీసింది.
2. అమెరికా ప్రభుత్వ బెంచ్ మార్క్ బాండ్ రాబడులు 5 శాతానికి చేరుకున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత బాండ్ ఈల్డ్స్ ఈ స్థాయికి వచ్చాయి. ఇంతకు ముందు 2007లో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ లేదా బాండ్లు వంటి ఇతర పెట్టుబడులకు అధిక అమెరికా ట్రెజరీ ఈల్డ్‌లు ఆశించిన రాబడిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.
Read Also:DK Aruna: మీడియా సంస్థల పై పరువు నష్టం దావా వేస్తా.. డీకే అరుణ సీరియస్
3. ఇది కాకుండా, ద్రవ్యోల్బణం కారణంగా అమెరికాలో పెట్టుబడిదారులలో భయానక వాతావరణం ఉంది. ఇటీవల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణంపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
4. అమెరికా డాలర్ ఇండెక్స్ 106 స్థాయి నుండి దిగజారింది. గత రెండు రోజులలో కూడా తీవ్ర పెరుగుదలను చూసింది. ఇప్పుడు అది 107 స్థాయికి చేరుకుంది. భారత స్టాక్ మార్కెట్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఇది ఆందోళనకరమైన పరిస్థితి.
5. గత కొన్ని వారాలుగా అమెరికా డాలర్ నిరంతరం పెరుగుతూ ఉండటంతో భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో ఎఫ్ఐఐలు నిరంతరం అమ్మకాలు జరుపుతున్నారు. వారు తమ డబ్బును అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి బంగారం, బాండ్లు, కరెన్సీలు మొదలైన ఇతర ఆస్తులకు బదిలీ చేయవచ్చు.