Oppo Reno 10 5G సిరీస్ ఫోన్లను ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లలో Oppo Reno 10, Reno 10 Pro మరియు Reno 10 Pro+ వెరైటీలు ఉన్నాయి. Oppo Reno 10 8GB + 256GB, ప్రో మోడల్ 12GB + 256GB ఫోన్లను లాంచ్ చేశారు.
టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Tecno Camon 20 ప్రీమియర్ 5Gని వినియోగదారుల కోసం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ లో ప్రత్యేక ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో MediaTek Dimension చిప్సెట్ ఉపయోగించారు. అంతేకాకుండా సెన్సార్ షిఫ్ట్ OISతో విడుదల చేసిన మొదటి ఫోన్ ఇదే. ఇండియాలో ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 GB RAM / 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది.
చాలా మంది తమ పేరుతో ఒక సొంత ఇల్లు ఉండాలని, ఓ ఇంటి స్థలం కొనుక్కోవాలని, మంచి ఏరియాలో ప్లాట్‌ను కొనుగోలు చేయాలని కోరుకుంటారు. జీవితంలో ఒక ఇల్లు కొనడం, లేదా కట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ కోరికను తీర్చుకోవడానికి పొదుపు చేస్తుంటారు.
దేశంలో రుతుపవనాల ప్రారంభంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాల ధరలు చాలా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.150 దాటింది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు రెస్టారెంట్లపైనా పడుతోంది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. బర్గర్ లో టమోటాలు పెట్టడం లేదని.. దీనివల్ల రుచిలో మార్పు ఉంటుందని తెలిపింది.
హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తియింది. దీంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రంపంచంలో నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. విలీనం తర్వాత కంపెనీ సైజు ఎంత పెరుగుతుంది, లాభాలు ఎలా ఉన్నాయి, షేర్ల కేటాయింపు, ఉద్యోగుల సంఖ్య ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బోర్డ్స్ ఆఫ్ డైరెక్టర్లు తమ విలీన ప్రతిపాదనను శనివారం అమోదించారు. విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తి కావడంతో 44 ఏళ్ల సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ జూలై 1…
KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసివేయబడినప్పటి నుండి భారతదేశంలో బంగారం ఉత్పత్తి దాదాపు ఆగిపోయింది. అయితే మరోసారి దేశంలోని గనుల నుండి బంగారం బయటపడబోతోంది. ఇందుకోసం ప్రభుత్వ మైనింగ్ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండిసి) పూర్తి సన్నాహాలు చేసింది. గనుల నుండి బంగారాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వ సంస్థ సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. NMDC ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిగరగుంట-బిసనాథం గోల్డ్ బ్లాక్‌ను లీజుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
తన ఎకరం పొలంలో నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఓ రైతు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా వ్యవసాయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ మామిడి, లిచ్చి, అరటితో పాటు కూరగాయలను రైతులు పెద్దఎత్తున సాగు చేస్తారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటలను రాజధాని పాట్నాకు సరఫరా చేస్తారు.
దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది.
రూ. 10,000 వరకు బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అందులో 64 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేయండి. అయితే ఇప్పుడు అలాంటి ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఫోన్ లో 128 GB ర్యామ్ కలిగి ఉంది. అన్ని క్వాలిటీ ఉన్న ఫోన్ ఏంటనుకుంటున్నారా Motorola Moto G13.
రిలయన్స్ జియో వినియోగదారులకు చౌకైన ప్లాన్లను అందించడమే కాకుండా సరసమైన ధరలో 4G స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. 4G స్మార్ట్ ఫోన్లు ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు వినియోగదారుల కోసం 5G కనెక్టివిటీ మద్దతుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి చాలారోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే Jio 5G ఫోన్‌కి సంబంధించి కొన్ని లీక్‌లు బయటపడ్డాయి.