CNG Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంలో పలువురు సీఎన్జీ వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్జీ ధరను మరోమారు పెంచుతున్నట్లు ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరగడం కారణంగా సీఎన్జీ ధరలను పెంచినట్టు వివరించింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ.79.56కి చేరింది. Read Also: Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు..…
Mclaren 765 LT: గత ఐదేళ్లలో భారతీయ మార్కెట్లో ఇతర దేశాల కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. లంబోర్ఘిని, ఆస్టన్, ఫెరారీ వంటి బ్రాండ్లు తమ కార్లను మన దేశంలో విక్రయాలు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మెక్లారెన్ ప్రవేశించింది. ఈ బ్రాండ్ ఏడాది క్రితం భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవల ముంబైలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ఈ బ్రాండ్ తన ఫ్లాగ్షిప్ సూపర్‌కార్ మెక్లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో…
Nirmala Sitharaman: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన మూడేళ్లలో దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసి మొండి బకాయిలు(NPA)గా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్బీఐనే రూ.1,64,735 కోట్ల…
Twitter: ఎలన్ మస్క్ వచ్చినప్పటి నుంచి ట్విట్టర్లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఒకే రంగులో వెరిఫికేషన్ టిక్ ఉండేది. కానీ ఇక నుంచి మూడు రంగుల్లో వెరిఫికేషన్ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ గతంలోనే నిర్ణయించింది. సెలబ్రిటీలకు సహా వ్యక్తిగత అకౌంట్లకు బ్లూ టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్ ఇస్తామని ఇప్పటికే ఎలన్ మస్క్ ప్రకటించారు. తాజాగా ఈ టిక్‌లను ట్విట్టర్ అమలు చేస్తోంది. వార్తలను అందించే ఏఎన్ఐ లాంటి…
YES Bank : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి) వడ్డీ రేట్లను సవరించింది. రూ.రెండు కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD)పై వడ్డీలో ఈ మార్పు చేపట్టింది.
Gold Rates Today: బంగారం కొనేవారికి ఇది గడ్డుకాలం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేవారు దారి ధర చూసుకోవాల్సిన సమయం. ఈ వారంలో పసడి ధర పరిగెత్తుతోంది.
Zomato: జొమాటో అనగానే ఫుడ్ డెలివరీ గుర్తుకొస్తుంది. నిమిషాల వ్యవధిలో ఇంటికి తెచ్చిస్తారు. ఇంటికే కాదు. ఆఫీసులో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. లోకేషన్ ప్రకారం వాలిపోతారు. పార్సిల్ మన చేతిలో పెట్టిపోతారు. అయితే ఆ సంస్థ ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 3 శాతం మంది సిబ్బందిని పనిలోంచి తీసేయాలనుకుంటోంది. తద్వారా లాభాలు ఆర్జించాలని కూడా ఆశిస్తోంది.
Text Message: ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. మొబైల్ లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. అందరూ ఆన్లైన్లోనే చాటింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సాప్ మెసేజ్‌లు, మెసేంజర్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నాం. అయితే పూర్వం ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్‌లను మాములుగా పంపేవాళ్లం. ఈ మెసేజ్ ప్రారంభమై 30 ఏళ్లు గడిచిపోయాయి. యూకేలోని బెర్క్‌షైర్‌కు చెందిన ఇంజినీర్నీల్పాప్వర్త్ 1992 డిసెంబర్ 3న తొలిసారిగా ఓ ఎస్ఎంఎస్ చేశాడు. వొడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్…