భారత్‌లోని డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మివేసేందుకు రెడీ అయింది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక, డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నాట్లు తెలుస్తుంది. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం, ఈ చర్చల్లో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాను అలాగే ఉంచుకుని మిగిలిన మేజర్ వాటాను నగదు బదిలితో పాటు స్టాక్స్‌ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు చేస్తుంది. ఇప్పటి వరకు డీల్ పై తుది నిర్ణయం తీసుకోలేదు.. డిస్నీ ఆస్తులను కొంత కాలం పాటు ఉంచుకోవాలని వాల్ట్ డిస్నీ అనుకుంటుందనే ఊహాగాహానాలు వినిపిస్తున్నాయి.
Read Also: World Cup 2023: నేడు దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
ఇక, 2022లో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు ముకేష్ అంబానీ దక్కించుకున్నారు. జియో సినిమా ఫ్లాట్‌ఫారమ్‌లో ఐపీఎల్ ప్రసారాల్ని ఫ్రీగా యూజర్లకు అందించారు. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీవో షోలను భారత్‌లో ప్రసారం చేసేందుకు గాను ఆ హక్కుల్ని కూడా రిలయన్స్ సంస్థ దక్కించుకుంది. దీంతో వాల్ట్‌డిస్నీ స్టార్ డిస్నీని అమ్మే వేసేందుకు నిశ్చయించుకుంది. భారత్ – న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయని డిస్నీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 35 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెల్లడించింది.