అజిత్ దోవల్ పేరు అందరికీ సుపరిచితమే. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అనుభవజ్ఞులు, నాయకులు కూడా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్న అతడిని ప్రశంసించడం ప్రారంభించారు. తాజాగా ఓ కార్యక్రమంలో అజిత్ దోవల్ ఇజ్రాయెల్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో పాటు భారత్‌కు సంబంధించి ఓ పెద్ద ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై అజిత్ దోవల్ మాట్లాడుతూ.. “ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ఇటీవల క్షిపణి దాడి జరిపింది. ఇజ్రాయెల్ 1500 క్షిపణులలో 99 శాతం ధ్వంసం చేసింది. కేవలం 2-3 క్షిపణులు మాత్రమే ఆపలేకపోయింది. రక్షణ కోసం ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థల లాంటి పటిష్టమైన ప్రణాళికలను రూపొందించింది. అందుకే ఇంత పెద్ద దాడులను ఎదుర్కోగలిగింది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: General Class Coaches: జనరల్ కంపార్ట్మెంట్లు రైలులో ముందు, వెనుక మాత్రమే ఎందుకుంటాయంటే..
అనంతరం అజిత్ దోవల్ భారతదేశం గురించి పెద్ద ప్రకటన చేశారు. BSF కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. “నేడు భారతదేశం మారుతోంది, మనం మారుతున్న కాలంలో జీవిస్తున్నాము. రాబోయే 10 సంవత్సరాలలో మన దేశం ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన సైనిక శక్తిగా కూడా మారుతుంది. మన దేశం స్వావలంబనతో ఉంటుంది. భారతదేశం, ఇప్పటివరకు ఆయుధాలు, పరికరాల దిగుమతిదారు. కాని ఇప్పుడు భారత్ ఆయుధాల ప్రధాన ఎగుమతిదారుగా మారింది.” అని ఆయన పేర్కొన్నారు. మన సరిహద్దుల భద్రతపై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎన్‌ఎస్‌ఏ పేర్కొంది. దాని ఫలితం నేడు కనిపిస్తోంది. మారుమూల సరిహద్దుల్లో BSF, ITBP, ఆర్మీ సిబ్బందితో కలిసి ప్రధాని ప్రతి దీపావళిని జరుపుకుంటున్నారు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న 12 వేల గ్రామాలను సర్వే చేసిన ఘనత కూడా ప్రధాని మోడీకే దక్కుతుంది. అధికారంలో ఉన్న పెద్ద నాయకులు సరిహద్దుల తీవ్రతను, ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే సగం పని ఆటోమేటిక్‌గా జరుగుతుందని ఎన్ఎస్ఏ అభిప్రాయపడింది.