ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ పై చర్చ జరిగింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చారు. ఈ క్రమంలో భూ భారతి బిల్లుకు శాసన సభ ఆమోదం కూడా తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. కొద్ది మందికి జరుగుతున్న నష్టం పేరు మీద ధరణి రద్దు చేసి భూ భారతి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని అన్నారు.
భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు.
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్ను అప్రతిష్టపాలు చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు, తప్పిదాల ఫలితంగా రాష్ట్రం ఏ విధంగా దివాళా తీసిందో శాసనసభ సాక్షిగా ఈరోజు బయటపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.6 లక్షల 71 వేల 756 కోట్లు అప్పు చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.. అదే సమయంలో ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1 లక్షా 27 వేల కోట్లకుపైగా అప్పులు చేసినట్లు కూడా అసెంబ్లీ…
ఓఆర్ఆర్ టెండర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో రేవంత్రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గురివింద గింజ సామెతను తలపిస్తోందని.. అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేఖ ద్వారా సవాల్ విసిరారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందని లేఖలో తెలిపారు.
Revanth Reddy: తెలంగాణలో ఆదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మంగళవారం (డిసెంబర్ 18, 2024) పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం “చలో రాజ్ భవన్” పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్లో, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి…
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ చర్చలో ఇటీవల జరిగిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేచింది. విపక్షపార్టీ ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలపై రవాణా, పౌరసరఫరాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. “వివేక్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలి” అని తెలిపారు. వివేక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదని, ఆయన 2014లోనే అసెంబ్లీకి వచ్చి ఇంకా అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. వివేక్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.…