Breaking News : కేటీఆర్, కేసీఆర్ భేటీ.. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపై కీలక చర్చలు
- బీఆర్‌ఎస్ లో అంతర్గత కలహాలు
- కవిత లేఖ సర్వత్రా చర్చ
- కేటీఆర్.. కేసీఆర్ సమావేశంపై ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News : బీఆర్‌ఎస్ పార్టీలో పెరుగుతున్న అంతర్గత కలహాల నడుమ, ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి ఫాం హౌస్‌కి వెళ్లినట్లు సమాచారం. ఈ భేటీలో కవిత లేఖతో పాటు, ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై వచ్చిన నోటీసుల అంశాలను చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌లకు అధికారిక నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తి సభ అనంతరం కవిత తన తండ్రికి రాసిన లేఖ, ఆ సభలో కనిపించిన పాజిటివ్, నెగిటివ్ అంశాలు, పార్టీ నేతల చుట్టూ ‘దెయ్యాల’ ఉన్నారన్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇప్పటికే హరీష్ రావు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం ఉండగా, కేటీఆర్ సర్దిచెప్పారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలి అనే దానిపై ఇంటి పోటీ చెలరేగినట్లు విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య అధికారం కోసం మౌన పోరాటం సాగుతోందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకేందుకు, అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు కేటీఆర్ – కేసీఆర్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!