Bandi Sanjay: సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చేదాకా కలెక్టర్ కార్యాలయం వద్దే కూర్చాంటా అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డికి చేరుకున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాములుని కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చేసిన హత్యేనని ఆరోపించారు.. ముఖ్యమంత్రి కామారెడ్డికి వచ్చే దాకా కలెక్టరేట్ వద్దనే కూర్చుంటాన్న ఆయన.. కామారెడ్డి రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమంలో పాల్గొంటాం అన్నారు.. రైతు రాములు ఆత్మహత్య తెలంగాణ రైతాంగాన్ని కలిచి వేసింది.. అడ్లూరి రైతు రాములుది పేద కుటుంబం, రెండు ఎకరాలు ఇండస్ట్రీ జోన్ లో పోతుందని బాధపడ్డాడని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రియల్ జోన్ కు బీజేపీ గాని, కామారెడ్డి ప్రజలు గాని వ్యతిరేకం కాదు.. కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని మండిపడ్డారు.
Read Also: Veera Simha Reddy: పంచెకట్టులో నట సింహం గ్రాండ్ ఎంట్రీ
ఇక, అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు బండి సంజయ్.. రైతులను కలిసి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాస్టర్ ప్లాన్ చేసి రైతుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. రైతులకు వాస్తవ విషయాలు చెప్పకుండా ఎందుకు ఉన్నారు? రైతులు ప్రశ్నించకుండా ఉద్యమం చేయకుంటే ఎన్ని చేసేసేవాళ్లు అని ప్రశ్నించారు. మరోవైపు.. కొంత మంది కలెక్టర్లు రియల్ వ్యాపారాలలో దావత్‌లకు కూడా పోతారని ఆరోపించారు.. కలెక్టర్‌గా చేయడం రాకపోతే బీఆర్ఎస్ జెండా కప్పుకోవాలని.. కలెక్టర్ కు ఇంగిత జ్ఞానం కూడా లేదని ఫైర్ అయ్యారు.. మాస్టర్ ప్లాన్ లో ఏది అనుకూలంగా ఉంటే అదే చేస్తారు.. పేదల భూములు గురించి పట్టించుకోరు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.. కేసీఆర్ కామారెడ్డి రైతుల సమస్యలపై ఎందుకు స్పందించవు? అని నిలదీశారు.. కేసీఆర్ కొడుకు రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిగా పేర్కొన్న ఆయన.. తెలంగాణలో 8 సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్ ఎందుకు చేయలేదు..? ఇప్పుడు భూముల కోసం చేస్తున్నావా? అంటూ మండిపడ్డారు బండి సంజయ్.