BRS Kisan Cell President Gurnam Singh Comments: దేశంలో పెద్ద మార్పు రావాలని, పేదలు,రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు లేవని అన్నారు భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు,పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు,రైతు భీమా సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని.. తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాలు యావత్…
ఉపాధిహామీ పథకం.. తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయి ? అని ప్రశ్నించారు. బిల్లులు ఎత్తుకున్నారు ? చట్ట వ్యతిరేకంగా వాడారు ? కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను…
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని.. తెలంగాణ రైతులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, వారితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కేంద్రం వైఖరికి నిరసనగా ఉద్యమించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Errabelli Dayakar Rao criticizes Chandrababu Naidu: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదని అన్నారు. టీడీపీ ఎన్టీరామారావు పార్టీ అని అన్నారు. మధ్యలో వచ్చినవాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఎన్టీఆర్‌ని చంద్రబాబు మోసం చేశాడని.. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగా తన కొడుకును…
Niranjan Reddy criticizes BJP and Kishan Reddy: ఉపాధి హామీ పనుల కింద కల్లాల నిర్మానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని.. కానీ ఈ పనులు చేయడానికి వీలు లేదని కేంద్రం తెలంగాణకు నోటీసులు ఇచ్చింది.. రైతుల కోసం కల్లాలు కట్టడం నేరామా..? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఉపాధి హమీ పనుల్లో వ్యవసాయ ఉత్పత్తి పెంచే పనులు చేసుకోవచ్చని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. అయినా కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.