DK Aruna : రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన చేస్తున్న మీకు మోడీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేటీఆర్… మోడీపై కామెంట్ చేసేంత మొనగాళ్లయ్యారా? మీరు, మీ అయ్య మోడీ కాలిగోటి కూడా సరిపోరు అంటూ ఆమె నిప్పులు చెరిగారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్న మీరు ముందుగా ఉద్యోగస్తులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇస్తలేరో సమాధానం చెప్పండని ఆమె ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాలుసహా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పండని డీకే అరుణ అన్నారు. నరేంద్ర మోదీ ఫ్రీ రేషన్ ఇచ్చినప్పటికీ నువ్వు ఇంకా ప్రజలకు ఎందుకు ఇయ్యట్లేదు… దానికి సమాధానం చెప్పండని, రూ. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు అదనంగా ఎన్ని ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చినారో ప్రజలకు జవాబు చెప్పండని ఆమె అన్నారు. గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంట్లో జమ చేసిన నిధుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు దొంగతనం చేశారో సమాధానం చెప్పండని ఆమె మండిపడ్డారు. సిగ్గులేకుండా రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన చేస్తున్న మీకు మోడీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆమె అన్నారు.
Also Read : Priyanka Chopra: టూ పీస్ బికినీలో ప్రియాంక.. మరీ దారుణంగా చూపిస్తుందే
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
నరేంద్ర మోడీ స్వచ్ఛమైన రాజకీయ నాయకుడని, ఆయనకు భారతదేశమే కుటుంబమని ఆమె అన్నారు. మీది అవినీతి కంపులో దొర్లుతున్న కుటుంబమన్న డీకే అరుణ… మీ చెల్లె లిక్కర్ స్కామ్ లో… మీరు డ్రగ్ స్కాం లో…. మీ అయ్య కాళేశ్వరం స్కామ్ లో… టోటల్ గా మీ ఫ్యామిలీ స్కాముల్లో కూరుకుపోయిన దొంగలు అని ఆమె అన్నారు. ఏదో ఒక రోజు మీరంతా ఒకే చోట చిప్పకూడు తినడం ఖాయమని, మూడేళ్ల నుండి కేంద్రానికి తెలంగాణ రూ.3.68 లక్షల కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతుండటం హాస్యాస్పదమన్నారు. ఆ రోజు నుంచి ప్రజలు ఇంకా పనులు కట్టడంలేదా? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులివ్వడం లేదని మీరు చెప్పడం సిగ్గు చేటు. మీరు కళ్ళు లేని కబోదిలా మాట్లాడుతున్నారు. తెలంగాణలో కేవలం జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టిన ఘనత కేంద్రానిదే. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందనే విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని రెండేళ్లుగా సవాల్ విసురుతున్నాం. అయినా నేటికీ చర్చకు రాని మీరు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టడం సిగ్గు చేటు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పుడు సందర్భంగా మీరు డ్రగ్స్ తీసుకున్నారని, దమ్ముంటే శాంపిల్ ఇవ్వాలని రెండేళ్ల కిందనే మేము డిమాండ్ చేస్తే నాడు మౌనంగా ఉన్న మీరు… దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మోరిగినట్లుగా డ్రగ్స్ ఆనవాళ్లు పూర్తిగా మాయమయ్యాయని నిర్దారించుకున్న తరువాత వచ్చి చాలెంజ్ చేయడాన్ని చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది.
Also Read : Nora Fatehi: అమ్మబాబోయ్.. మనోహరీ అందాలు ఉబికి వస్తున్నాయే
మొన్నటి సెస్ ఎలక్షన్లో మా బీజేపీ నాయకులు మీకు ట్రైలర్ మాత్రమే చూపించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సిరిసిల్లలో మీకు అసలు సిసిలు సినిమా చూపిస్తాం. సెస్ ఎన్నికల్లో గెలుపు కోసం నీవు ఎన్ని నువ్వు ఎన్ని అడ్డదారులు తొక్కినవో యావత్ తెలంగాణ సమాజం చూసింది. బిజెపి గెలిచిన సీటును కూడా నిర్లజ్జగా తారుమారు చేసి మీ ఖాతాలో కలుపుకున్న దుర్మార్గులు మీరు. వేములవాడ దేవాలయానికి ఏటా 100 కోట్లు చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని మీ అయ్య హామీ ఇచ్చి ఏడేళ్లు కావొస్తుంది. ఆ నిధులిస్తవో ప్రజలకు సమాధానం చెప్పండి. ‘ప్రసాద్’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే వేములవాడ ఆలయ అభివ్రుద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని బండి సంజయ్ మూడేళ్లుగా కోరుతున్నా ఇంతవరకు ఎందుకు ప్రతిపాదనలు పంపలేదో సమాధానం చెప్పండి. వేములవాడ ఆలయం అభివ్రుద్ధి అయితే నరేంద్రమోదీ ప్రభుత్వానికి, బండి సంజయ్ గారికి పేరొస్తుందనే భయంతో ప్రతిపాదనలు పంపకుండా ఎములాడ రాజన్ననే మోసం చేసిన మీరా మాట్లాడేది? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం మొట్టికాయ వేసినా మీలో ఇంకా మార్పు రాకపోవడం సిగ్గు చేటు. ఏపీకి కేటాయించిన సోమేశ్ కుమార్ ను ఇక్కడ ఉంచడమే కాకుండా మీ అవినీతి కోసం ఆయనకు సిఎస్ ని కూడా చేశారు. తెలంగాణలో సీఎస్ పదవికి అర్హులైన అధికారులు లేరా? పోయేకాలం దగ్గరకు వస్తే గిట్లంటి చెత్తబుద్దిలే వస్తాయి నరేంద్రమోదీ గురించి, బీజేపీ నేతల గురించి పిచ్చిపిచ్చిగా వాగితే ఊరుకునేది లేదు. నోటిని హద్దులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా.’ అని ఆమె ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!