Off The Record: దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెద్ద కార్యక్రమం భారత్ జోడో పాదయాత్ర. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర చివరి దశకు చేరుకుంటోంది. ఏదో సాదాసీదాగా భారత్ జోడో పాదయాత్ర కార్యక్రమాన్ని ముగించకుండా.. భారీగా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ముగింపు కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని 21 రాజకీయపార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం టీడీపీకి మాత్రమే ఇన్విటేషన్ వెళ్లింది. బీఆర్ఎస్ను…
మహబూబాబాద్ లో బీఆర్ఎస్ నూత కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పార్టీ నేత కార్యాలయాలను బీఆర్ఎస్ నిర్మించింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
Harish Rao Meet Tummala Nageswara Rao: ఖమ్మం రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తొలి సభకు సిద్ధం అవుతోన్న వేళ.. బీఆర్ఎస్కు గండి కొట్టే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.. ఎవరు ఉంటారు? ఎవరు బైబై చెప్పేస్తారు? అనే టెన్షన్ కొనసాగుతున్నాయి.. అయితే, ఖమ్మం పర్యటనలో ఉన్న మంత్రి హరీష్‌రావు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు.. ఇది రాజకీయాల్లో కొత్త పరిణామానికి దారితీస్తుందని అంటున్నారు విశ్లేషకులు.. ఉమ్మడి ఖమ్మం…
Off The Record: పట్నం మహేందర్‌రెడ్డి. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న ఈయన కొంతకాలంగా అధికారపార్టీలో చర్చగా మారారు. ఆయన వైఖరి వల్ల పార్టీ హైకమాండ్ దగ్గర పంచాయితీలు అయిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మహేందర్‌రెడ్డికి తోడు ఆయన భార్య.. జడ్పీ ఛైర్పర్సన్ సునీత సైతం స్వరం పెంచారు. ఇప్పటి వరకు మహేందర్‌రెడ్డి ఒక్కరే అసంతృప్తిని వ్యక్తం చేసేవారు.. తనపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి.. గులాబీ శిబిరంలో చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డిపై కయ్మనేవారు.…
Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు…
Off The Record: ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ హాట్ రాజకీయాలకు వేదిక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం. ప్రస్తుతం తూర్పు సెగ్మెంట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అదీ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ద్వారా. ప్రదీప్‌రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు. మొన్నటి వరకు అధికారపార్టీలోనే ఉన్నారు. ఈ మధ్యే బీజేపీలోకి జంప్ చేశారు. అప్పటి నుంచి తూర్పులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు ప్రదీప్‌రావు. వాస్తవానికి గులాబీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేతో…