Bhatti Vikramarka: టాక్స్ రెవెన్యూ 40 వేలకోట్లా!.. టాక్స్ వేశారా? వేయాలని ఆలోచిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ట్యాక్స్ రెవెన్యూ రూ.40 వేళా కోట్లు చూపెట్టారని, దీనిపై ట్యాక్స్ వేశారా? వేయాలని ఆలోచిస్తున్నారా..?అంటూ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దేశ సంపద దోపిడీకి గురి అవతోందని ఆగ్రహంమం వ్యక్తం చేశారు. రూ.41 వేల కోట్లు గ్రాంట్స్ అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రూ.8 వేల కోట్లు దాటలేదన్నారు. రూ. 4.86 వేలకోట్ల అప్పు చేశారని తెలిపారు. ఈ అప్పులు ఎవరు కట్టాలి? అని ప్రశ్నించారు. సామాన్యుల మీదనే కదా భారం వేసేది అంటూ మండిపడ్డారు. తలసరి ఆదాయం పెరిగింది అని లెక్కలు చెప్తున్నారూ.. ఎలా పెరిగాయి చెప్పండి? అంటూ ప్రశ్నించారు. ఆదాయం పెరిగింది కొందరికె అంటూ పారిశ్రామిక వేత్తల పేర్లు ప్రస్తావించిన భట్టి. రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరిగింది పార్థసారథి రెడ్డి, పిచ్చిరెడ్డి.. జూపల్లి రామేశ్వర్ రావు, మేఘా కృష్ణా రెడ్డి ల ఆదాయం పెరిగిందని వ్యాఖ్యానించారు.
Read also: MLA’s Purchase: ఎమ్మెల్యేల ఎర కేసు.. 17న విచారిస్తామన్న సుప్రీం కోర్టు
Also Read
పేదలకు ఇండ్ల జాగా ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు. తన నియోజకవర్గం లో ప్రియాంక అనే మహిళ నన్ను అడిగిందని, మూడు తరాల వాళ్ళం ఒకటే గదిలో కాపురం చేస్తున్నాం అని బాధ పడిందని తెలిపారు. రాష్ట్రంలో ఓ వ్యక్తికి రెండు లక్షల స్కోయర్ ఫీట్ల ఇల్లు ఉందని, పేదలకు అసలు ఇంటి జాగా లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు పెరిగిపోయాయని ఖ్యానించారన్నారు. రాహుల్ గాంధీ దేశం అంతా తిరిగి చెప్పారని, భారత దేశం కోరుకున్నది విద్వేష రాజకీయాలు కాదని తెలిపారు. భారత్ జోడో యాత్రలో పేదలు రైతులు అంతా దేశాన్ని కాపాడండి అని చెప్పారని పేర్కొన్నారు భట్టి. రాహుల్ గాంధీ చెప్తే బీజేపీ అవహేళన చేసిందని మండిపడ్డారు. ఆధాని కంపనీ ఏం చేసింది అనేది బయట పడిందని వ్యాఖ్యానించారు. అధాని మీద దాడి అంటే.. దేశం మీద దాడి అంటుందని. ఇదేం పద్ధతి? అంటూ ప్రస్తావించారు. మతం మత్తు మందు లాంటిది అన్నారు. జ్ఞానంతో పాలన చేయండి అని చెప్పిన సోక్రటిస్ కి విషం ఇచ్చి చంపారని గుర్తు చేశారు. నాగరిక సమాజంలో.. మళ్ళీ మతం పేరుతో రాజకీయం ఏంటి? అని ప్రశ్నించారు.
Read also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరో కీలక వ్యక్తి అరెస్టు
దేశంలో ఎలా ఉందో రాష్ట్రంలో కూడా అలాగే ఉందని ఆరోపించారు. భూమి లేని పేదల గురించి ఆలోచన చేయండి.. ఇండ్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వండి అని కోరారు. భూపంపిణీ చేయాలి కానీ.. పంపిణీ చేసిన స్థలాలు వెనక్కి లాక్కుంటున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు..అసైన్డ్ భూములు తీసుకోకండి అని సూచించారు. సమస్యలు చూపెట్టడం కాదు.. పరిష్కారం కూడా చేయాలని కోరారు. యువత ఉద్యోగాల కోసం చూస్తుందని, ఉద్యోగాలు లేక పెండ్లిళ్ల సప్లైర్ గా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు ఆసుపత్రిలను కంట్రోల్ చేయండి, పేదలు వెళ్తే లక్షల్లో బిల్లులు వేస్తున్నారని కోరారు. ఇటీవల అపోలో కి వెళ్లిన పేషేంట్ కి 9 లక్షలు వేశారని, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. ప్రభుత్వం కంట్రోల్ చేయాలని కోరారు. నారాయణ..చైతన్య కాలేజిలో లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని కంట్రోల్ చేయండి అని తెలిపారు. కృష్ణ నదిలో మన వాటా ఎంతో ఇంకా తేల్చలేదు అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై కట్టిన ప్రాజెక్టుల లో ఎన్నిటికి డిపీఆర్‌లు ఉన్నాయి? సభలో పెట్టండి? అంటూ ప్రశ్నించారు. మా గొంతు నొక్కితే తెలంగాణకు నష్టం అన్నారు. మీరు చేసినా చేయకపోయినా మేము చెప్తమన్నా భట్టి విక్రమార్క.
Revanth Reddy: ప్రగతిభవన్ వాఖ్యలపై రేవంత్ స్పందన.. కేసులకు భయపడను కొత్త ఏమి కాదు
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?