ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.. జాతీయ రాజకీయాలను మరింతగా ఆకర్షించడమే ఈ సభ లక్ష్యం. ఇటీవల ఖమ్మంలో బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో రాష్ట్రం వెలుపల ఇదే తరహాలో మరో సభ నిర్వహిస్తే.. పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాను ఎగుర వేసిన రాష్ట్ర అధ్యక్షుండు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు.
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగానికి భిన్నంగా సిఎం కెసిఆర్ పరిపాలన చేయడం బాధాకరమన్నారు.