తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తు్న్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ధనిక రాష్ట్రంగా మార్చుతామని, కేసీఆర్ చేసిన దుబారను నివారిస్తే… తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందని, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్‌ని ప్రజలు వెళ్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసమని, ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాలన్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ ప్రజలను కలవలేదా? అని ఆయన అన్నారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు? తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Nani: వ్యాలెంటైన్స్ డేకి ‘హార్ట్ బ్రేక్’ని ఎంజాయ్ చేద్దాం…
అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత మేం తీసుకుంటామని, నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్న కేసీఆర్ ను ఎలా సమర్దించారు.? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు నేను మాట్లాడితే ఎందుకు తప్పుపడుతున్నారు? అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆలోచననే నేను చెప్పానని, నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకోసమే మా యాత్ర అని, మేం గాంధీ వారసులం.. అహింసకు వ్యతిరేకమన్నారు రేవంత్ రెడ్డి. శాంతి కోసమే ఈ యాత్ర చేస్తున్నామని, తెలంగాణ వచ్చాక ఎన్‌కౌంటర్ లు ఉండవని కేసీఆర్ చెప్పాడని, రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్‌కౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారన్నారు రేవంత్ రెడ్డి. 9నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారని, కానీ 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారని ఆయన విమర్శించారు. వృథా ఖర్చులు తగ్గిస్తే రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వెళుతుందని ఆయన అన్నారు.
Also Read : Rama Siva Reddy: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. అసలు విషయం బయటపెట్టిన కోటంరెడ్డి స్నేహితుడు..!