టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భవన్ కూడా కూల్చివేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది… అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు వేల కోట్ల రూపాయలతో 120గదుల ప్రగతి భవన్ ను హైదరాబాద్ నడిబొడ్డున కేసీఆర్ నిర్మించాడని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం ఉండదని తెలిపారు. ఆంధ్ర పెట్టుబడిదారీలకు మాత్రమే ప్రగతి భవన్ లోకి ప్రవేశం ఉంటుందన్నారు.
Also Read : Double Decker Bus : మళ్లీ హైదరాబాద్ రోడ్డు ఎక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఈ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. కేటీఆర్ ఓ సన్యాసి, డ్రామారావు అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మొత్తం మా కుటుంబమే అంటున్నా సన్యాసి అని, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు డ్రామారావు అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో చదువుకుంది గుంటూర్ లో, చిప్పలు కడిగింది అమెరికాలో అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉద్యమకారులను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ ద్రోహులంతా పదువులలో ఉన్నారని, తెలంగాణ ఉద్యమకారులకు ఏ ఒక్కరోజైనా బుక్కడు బువ్వ పెట్టావా? అని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను పెల్చేయాలంటూ ఆయన మండిపడ్డారు.
Also Read : Online Medical Appointments: పెరిగిన ఆన్‌లైన్ మెడికల్ అపాయింట్మెట్లు.. ఈ సమస్యలు ఉన్నవారే అధికం..