టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రగతిభవన్ ను కూల్చాలని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డీజీపీని కోరారు. అయితే.. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. ఈ పాదయాత్రలో ప్రగతిభవన్‌ను పేల్చాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
Also Read : Rishabh Pant: ‘పంత్.. నిన్ను కొట్టేస్తా’: మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్
రేవంత్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని… అక్కడ ప్రభుత్వ ఆఫీస్‌లపై పేల్చాలని డిమాండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అంటూ ప్రశ్నించారు పెద్దసుదర్శన్ రెడ్డి.
Also Read : INDvsAUS 1st Test: రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్ ఇదే..ఓపెనర్లుగా వీరే!