మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే…
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన మాట్లాడుతూ.. మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలోనే కొట్టుకొని పోతారని విమర్శించారు. దోపిడీలు చేసే నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలని.. వారు దొంగలుగా ముద్రించబడతారని ఆరోపించారు. మూడు ఎకరాలు ఇస్తామని.. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రజలను నట్టేటా ముంచారని భట్టి…
హైదరాబాద్ పెద్దమ్మతల్లి గుడి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్ ను పేస్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. శేజల్ కి ఎమర్జెన్సీ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నట్లు.. శేజల్ ఔటాఫ్ డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఆయుర్వేదిక్ సంబంధించిన నిద్ర మాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. మరికొద్దిసేపట్లో శేజెల్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు పేస్ అసుపత్రి వైద్యులు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్ఎస్ కు నచ్చటం లేదని ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ దశాబ్ద కాలం అయిన పూర్తి చేయలేదని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటున్నారని, అసలు కాలువలు నిర్మించకుండా రైతుల పొలాలకు సాగు నీరు ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు.