రాజకీయ పార్టీ అభివృద్ది కేవలం యువతతోనే సాధ్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టడంతో యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు చేయాల్సిన ఉద్యోగ భర్తీలు కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు అని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఇప్పటికీ అలానే ఉంది. శాసన సభ వేదికగా సిఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి చేయలేదు అని ఆయన అన్నారు.
Read Also: Divi Vadthya: రాకుమారిలా హొయలు పోతూ సెగలు రేపుతున్న దివి.. ఫోటోలు చూశారా?
దళితులకు కేటాయించిన 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడం.. మళ్ళీ బడ్జెట్ లోను అదే రిపీట్ చేస్తు దళితులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దళిత యువతకు ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వలేదు.. దళితులతో పాటు అన్ని వర్గాలను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేస్తున్నారు.. దేశంలో అవినీతి ప్రాజెక్ట్ అంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రమే అని ఆయన ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వరంగల్ సభాలో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Road Accident: శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సీఎం కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం చేతిలోనే ఈడీ, సీఐడీ, ఏం చేస్తున్నాయి.. బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి బందానికి ఇంతకంటే ఏం చెప్పాలి అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతున్నారు అని జీవన్ రెడ్డి అన్నారు.