KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ రెండు రోజు ఢిల్లీ పర్యటన కొనసాగతుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరితో కేటీఆర్ సమావేశం కానున్నారు. మెట్రో రెండో దశ పనులకు కేంద్ర సాయం కొరనున్నారు. ఇక అమిత్ షా అపాయింట్మంట్ కోసం కేటీఆర్ వేచివున్నారు.
కేంద్ర రక్షణ రాజ్నాథ్ కు నాలుగు రిక్వెస్ట్లు ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తే సంతోషిస్తామాని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు.
Komatireddy Venkatreddy: అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నిరసనలు వ్యక్తం చేసే హక్కు ఉంటుందని అన్నారు.
Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.