దక్షిణాదిలో పార్టీనీ బలోపేతం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ ఎన్నికల మిషనరీ నీ తట్టుకునే శక్తి ఏ పార్టీ కి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో బీజేపీనీ అధికారంలోకి తీసుకు రావడానికి పార్టీ హై కమాండ్ రంగం లో దిగిందని ఆయన వెల్లడించారు. ప్రధాని సభలో గెలుపుపై విశ్వాసం మరింత పెరిగిందని లక్ష్మణ్ అన్నారు.
Also Read : SS Rajamouli: దైవ చింతనలో రాజమౌళి.. అక్కడి ఆలయాలు అన్నీ చుట్టేస్తున్నాడు!
ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగిందని, అవినీతి కేసీఆర్ ప్రభుత్వం పై మోడీ విరుచుకు పడ్డారని ఆయన అన్నారు. అయన ప్రసంగంలో తెలంగాణ ప్రజల పట్ల ఉన్న అవేదన కనిపించిందని, విపక్ష పార్టీల సీఎంలు అభివృద్ధిలో పాలు పంచుకుంటుంటే కేసీఆర్ మాత్రం కప్పదాటు వైఖరితో ఉన్నారని, సహకరించడం లేదని ఆయన మండిపడ్డారు. 30 శాతం కమిషన్ సర్కార్ ను ప్రజలు తరిమి కొడతారని లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Kishan Reddy : ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించాలి
అంతేకాకుండా.. దశాబ్ధి ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ నేతలు తమ అవినీతిని ఒకరిది ఒకరు బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తారని దీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవినీతిలో మొదటి స్థానానికి చేరుకుందని ఆరోపణలు చేశాడు. ఈ రాష్ట్రం అవినీతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తుండడం మూలంగానే ప్రధానిని కలవడానికి ముఖం చెల్లట్లేదు అంటూ కామెంట్ చేశాడు ఎంపీ లక్ష్మణ్.