మంత్రి మల్లారెడ్డి అంటే ఇప్పుడు తెలియని వాళ్లు ఎవరు ఉండరంటే నమ్మశక్యంగాని విషయం. ఎందుకంటే తన మాటలు, చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏ వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. కష్టపడ్డా, పాలు అమ్మినా, పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా అనే మాటలే వినిపిస్తాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ చాలా ఫేమస్ అయింది. ఇక అసెంబ్లీలో మల్లారెడ్డి మైక్ పట్టుకుంటే ప్రతిపక్ష పార్టీలైన నవ్వు ఆపుకోవడం కష్టమే.. అయితే ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి మంత్రి మల్లారెడ్డి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also: Kushitha Kallapu: పొట్టి గౌనులో బజ్జీల పాప రచ్చ.. మరీ ఈ రేంజ్ హాట్ షో అంటే ఎలా?
తాను చిన్నప్పటి నుంచి బోనాల పండగలో పాల్గొంటున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు తాను అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ తీరాయని ఆయన అన్నారు. ఈ ఏడాది సీఎం కేసీఆర్ కోసం ఒకటి కోరుకున్నానని.. అది కూడా తీరుతుందని మలన్న ఆకాంక్షించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. అది నెరవేరాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయవంతం కావాల్సిన అవసరం ఉందని మంత్రి మలన్న చెప్పాడు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, బీజేపీల పరిపాలన చూశామని.. కానీ బీఆర్ఎస్ మాదిరిగా ఎవరూ డెవలప్మెంట్ చేయలేకపోయారని మల్లారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Naga Chaitanya : త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్న నాగ చైతన్య..?
ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల పండగ సందర్భంగా ఈ సారి దేశానికి ప్రధాన మంత్రిగా కేసీఆర్ కావాలని అని కోరుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది దేశవ్యాప్తంగా కావాలంటే కేసీఆర్ ప్రధాని అయితేనే ఈ డెవలప్మెంట్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ది చేస్తామని చేయడం లేదని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో విధంగా చూసినంత కాలం దేశం డెవలప్మెంట్ కాదు అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.