పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదని అన్నారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
20 కోట్లు పెట్టి మీ ఈటెల రాజేందర్ ను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారని, ఇందతా సీఎం కేసీఆర్ చెబితేనే ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారని ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము తప్పు చేయనప్పుడు మా ప్రతిష్ట ఎందుకు దిగజారుతోంది? అని ఈటల జమున ప్రశ్నించారు.
ఇపుడు మొదలైంది ఆట అంటున్నారు.. రకరకాల వెన్నుపోట్లు చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త అని బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పక్క రాష్ట్రాల్లో కూడా ఆర్టీసి పరిస్థితులు బాగాలేవరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజా రవాణాలో టీఎస్ ఆర్టీసీ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. కరోనా దెబ్బకు బస్సులు డిపోలకే పరిమితమై.. రోజుకి కోటి రూపాయలు కూడా రాలేదని గుర్తు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ ఉదయం 8 గంటలకు పండరీపురం వెళ్లనున్నారు. అక్కడ రుక్మిణి సమేతంగా విఠేశ్వరస్వామిని పూజిస్తారు. ఆ తర్వాత షోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు.
Minister KTR: నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.. కేసీఆర్ ను ఎందుకు జైలుకు పంపుతావ్ ? అంటూ మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. హైదరాబాద్ లో మొట్టమొదటి స్కై వాక్ బ్రిడ్జి ఉప్పల్ లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు.
కేంద్ర మంత్రి అమిత్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ కాలేదు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నా అమిత్ షా బిజీగా ఉండడంతో సమావేశం రద్దయింది. అమిత్ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని కేంద్ర హోంశాఖ అధికారులు కేటీఆర్ కు సమాచారం అందించారు.