Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆటను ఎలా మార్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత తొమ్మిదన్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. నేతలు చేజారిపోవడం, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌కి ఎదురులేకుండా పోయింది.
అయితే, వీటన్నింటికి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేకుండా ఎన్నికలకు వెళ్లడం ఒక కారణమైతే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. కర్ణాటక ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పని అయిపోయిందని, బీజేపీ ప్రత్యామ్నాయమని భావించినప్పటికీ, హస్తం పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడింది.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
Read Also: Chennur: చెన్నూర్‌లో భారీ ఆధిక్యం దిశగా వివేక్.. వెనుకంజలో బాల్క సుమన్..
అయితే 54 ఏళ్ల రేవంత్ రెడ్డి దక్షిణాదిలో కాంగ్రెస్‌కి మరో రాష్ట్రాన్ని కట్టబెట్టారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ చీఫ్, ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌పై కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఆధిక్యం కనబరుస్తున్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జూలై, 2021లో తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ విజయం కోసం రేవంత్ రెడ్డి గట్టిగా పనిచేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నప్పటికీ, కర్ణాటక ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి నాయకులంతా కలిసి పనిచేసిన విధంగా.. తెలంగాణలో ఇదే ఫార్మూలాను వర్కవుట్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
పలు జాతీయ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 80 సీట్లకు పైగా గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారా..? అనే ప్రశ్నకు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని చెప్పారు. తాను హైకమాండ్ ఆదేశాలు పాటిస్తానని అన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం తెలంగాణలో 119 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు కాంగ్రెస్ దాటి అధికారం దిశగా వెళ్తోంది.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!