తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. కొడంగల్, కామారెడ్డిలో మూడో రౌండ్‌లో రేవంత్‌రెడ్డికి లీడ్ లో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో 4159 ఓట్లు, కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు. అటు.. కల్వకుర్తిలో మూడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి 3443 ఓట్ల ఆధిక్యం, మంథని నియోజకవర్గంలో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకి 3425 ఓట్ల ఆధిక్యం, కొల్లాపూర్‌లో లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు, గోషామహల్ నియోజకవర్గంలో మూడో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్‌కు 2800 ఓట్ల ఆధిక్యం, ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్‌కు 500 లీడ్ లో ఉన్నారు. అంబర్‌పేట్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి 4080 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ లో మూడు రౌండ్లు ముగిసేవరకు 6000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి, వికారాబాద్‌లో మూడో రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజ, జనగాంలో 2989 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, సూర్యాపేటలో మూడో రౌండ్‌లో 1722 ఓట్ల ఆధిక్యంలో జగదీష్‌రెడ్డి ఉన్నారు.