తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులకు ఎదురుదెబ్బ తగిలింది. అందులో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది.