తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వచ్చింది. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు 18వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ విజయంతో ఖమ్మం జిల్లాలోనే రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా స్థానాలు కూడా కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది.