తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు.
తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.
Jagadish Reddy: ఎమ్మెల్సీ కవిత కేస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు.. ఈడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కూడా విచారణ చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు.
BRS KTR: కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కారు దిగేస్తారా? ఆమె పార్టీ మారిపోవడం ఖాయమైనట్టేనా? అదే నిజమైతే బీఆర్ఎస్ ముఖ్య నేత కే.కేశవరావు పరిస్థితి ఏంటి? తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్కు హ్యాండిస్తారా? లేక తండ్రీ కూతుళ్లు చెరో పార్టీలో ఉంటారా? మేయర్ పార్టీ మార్పు కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి? వలస నేతల కోసం తెలంగాణ కాంగ్రెస్ గేట్లు తెరిచాక బీఆర్ఎస్ కారుకు కుదుపులు పెరిగిపోతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు బడా నేతలు…