MLC Jeevan Reddy: తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ఓట్లు వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
MLC Elections: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. షాద్ నగర్ నియోజకవర్గానికి సంబందించి ఎంపిడిఓ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి క్యాంప్ ల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు బస్సుల్లో తరలివచ్చారు.
మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దం అయింది. నేడు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ సరళి కొనసాగనుంది. ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రసూల్‌పురాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డితో కలిసి స్థానికులతో మాట్లాడారు. ‘రసూల్‌పురా యువసేన’ అనే సంస్థ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మైనారిటీ కమ్యూనిటీ యువత కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులు, యువకులు, పిల్లలతో సహా ప్రజలతో కేటీఆర్ సంభాషించారు, వారు ఉత్సాహంగా కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఇఫ్తార్‌లో పాల్గొన్న కేటీఆర్‌కు రసూల్‌పురా యువసేన సభ్యులు…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు రాలేదని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుందని, మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగండని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వద్ద తాము ఓట్లు అడుగుతాం అని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. మనకు…
తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు.
తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.