లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా.. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా.. ముగ్ధుంపురంలో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై కేసీఆర్ ఆరా తీశారు. అయితే.. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు కేసీఆర్ కు తెలిపారు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేదని.. ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్లకు కూడా.. గోస అవుతుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Also: Hyderabad: రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం..
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. శాభాష్‌పల్లి వద్ద మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. సాయంత్రం చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి వద్ద రైతులతో ఆయన ముచ్చటించనున్నారు. తర్వాత వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Read Also: Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..