ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ అన్నారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు. వాళ్ళని ఏమి అనవద్దు.. వాళ్ళు కూడా మనవాళ్లే అని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ తనకు ఇష్టం అని తెలిపారు. రూ. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో.. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడదుల చేశారు. అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలని, దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయన్నారు. ఈ…
రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు కొత్తగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కీలక సమావేశం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెటుకు ఆనంద్ ఉన్నారు. తెలంగాణలో క్షీణిస్తున్న ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేయడానికి , ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఈ బృందం ఏర్పడింది , ఈ రోజు తన కార్యకలాపాలను ప్రారంభించింది.…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పర్సనల్‌గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్ లీడర్‌కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన కత్తులు నూరుతున్న ఆ సీనియర్ ఎవరు?
అట్టహాసంగా కట్టుకున్న బీఆర్ఎస్ ఆఫీసులకు ముప్పు ముంచుకొస్తోందా? నాడు అధికార బలంతో మనల్ని అడిగేది ఎవ్వడన్నట్టుగా నిర్మించిన పార్టీ కార్యాలయాల మీదికి ఇప్పుడు నిబంధనల బుల్డోజర్స్ దూసుకొస్తున్నాయా? పార్టీకి కొత్తగా ఇదో తలనొప్పిగా మారిందా? అసలు పార్టీ ఆఫీసుల నిర్మాణాలు ఎలా జరిగాయి? వాటికి ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది? ప్రతి జిల్లాలో పార్టీకి శాశ్వత కార్యాలయం ఉండాలన్న టార్గెట్‌తో… తాము అధికారంలో ఉన్నప్పుడు భారీ భవంతులు నిర్మించింది బీఆర్ఎస్. అయితే అప్పుడు పవర్ మనదేకదా అన్న…
Damodar Raja Narasimha: బీఆర్ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.