తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ కార్యక్రమం అందరిని ఒక్కటి చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగుపేట అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? అని ప్రశ్నించారు. సంజీవన్ రావు పేటలో పండుగ పూట ఏం అయ్యిందో చూశామన్నారు. పేదల కడుపు నింపడం కేసీఆర్ అజెండా.. పేదల కడుపు కొట్టడం కాంగ్రెస్ ఎజెండా అని విమర్శించారు. బతుకమ్మ చీరలు రెండు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు.. వర్షాకాలం రైతు బంధు లేదన్నారు. రుణమాఫీ సరిగా కాలేదని.. ఋణమాఫీపై డేట్లు పొడగిస్తున్నారన్నారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మళ్ళీ 2024 డిసెంబర్ 9 అంటూ కొత్త తేదీ చెప్పారని గుర్తు చేశారు.
READ MORE: Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరేకు అస్వస్థత.. రిలయన్స్ ఆస్పత్రికి తరలింపు
రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పరని.. ఎంత ఇస్తారో చెప్పరని మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని ఊరించి మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలే తప్ప కాంగ్రెస్ వాళ్లు ఇచ్చింది ఏమి లేదన్నారు.
READ MORE:Lawrence Bishnoi Gang: 700 మంది షూటర్లు.. 11 రాష్ట్రాల్లో నెట్‌వర్క్.. మరో దావూద్ ఇబ్రహీం!