బీఆర్ఎస్ అధిష్టానానికి జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయా? దెబ్బ ఎక్కడ పడిందో ఇన్నాళ్ళకు తెలిసొచ్చిందా? కోలుకోవడం కోసం మొదలుపెట్టిన ప్యాచ్ వర్క్ ఏంటి? అది ఎంత వరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? అసలు బీఆర్ఎస్ పోగొట్టుకున్నది ఎక్కడ? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలనుకుంటోంది ఆ పార్టీ? తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56 శాతం. ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలే. అయితే… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాస్తవాన్ని విస్మరించడంవల్లే… పవర్కు…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రమంతటా పర్యటించాలనుకుంటున్నారా? ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వస్తోందా? అతి త్వరలోనే ఆమె యాక్టివ్గా తిరగబోతున్నారా? కవిత రీ ఎంట్రీ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటి? అందులో నిజమెంత? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత… ఇకపై బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటూ..ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అయితే… ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న…
హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ‘నర్సుల నిర్లక్ష్యం శిశువు మృతి’ పై ఓ దినపత్రికలో వచ్చిన వార్త కథనంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. వార్త కథనం పై వైద్య విధాన పరిషత్ కమిషనర్ ను విచారణకు ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు తక్షణమే హుజూర్ నగర్ ఆస్పత్రి సూపరిoటేoడెంట్ గారితో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. టీవివిపి కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రిక లో వచ్చిన వార్త…
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మంత్రికి.. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా నిర్మించనున్న నాలుగు ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూర్ జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. వరద బాధితుల కోసం 30టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి… అనంతరం గురుపూజోత్సవంలో…
రాష్ట్రం అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రూ.…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు సోమ భరత్ కుమార్, సి. రాకేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు.
Ponnam Prabhakar: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆవిష్కరిస్తామన్నారు. యువతకు రాజీవ్ గాంధీ విగ్రహం ఆదర్శం.. రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టం.. రాజీవ్ చిరస్మరణీయుడు అని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆదిలాబాదు నుండి ఖమ్మం వరకి పాదయాత్ర చేసానని, మీ అందరి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా ప్రభుత్వమని, ప్రాజెక్టుల కొసం భూములని ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి.అందుకే నిధులు విడుదల చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. రెండు లక్షలు రుణమాఫి చేస్తానని మాట ఇచ్చాం చేసి చూపామని, హామీ ఇవ్వకున్నా 2 లక్షల పైన ఉన్న…