గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థుతులు అందరికీసని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని తెలిపారు.
Harish Rao: తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ రావుకు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీ వద్దకు వెళ్లేందుకు
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. ఈ వ్యవహారం తెలంగాణలో హీట్ పెంచింది.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి చేశారు.. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో.. తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో.. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద…
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కోర్టు తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు శునకానందాన్ని పొందుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తే నీతి.. వేరే వాళ్ళు చేస్తే అవినీతి అన్నట్టు ఉందని విమర్శించారు. అనర్హత వేటు పడుతుంది.. ఉప ఎన్నికలు వస్తాయి.. ఇవ్వన్నీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదని వ్యాఖ్యానించారు.
వచ్చే నాలుగు వారాల్లోగా ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. పార్టీ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తీర్పు ‘చెంపదెబ్బ’ అని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రజాస్వామ్య…