Harish Rao: మూసి ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని తెలిపారు.
అది పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు. కానీ... తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో ఉందట. ఎప్పుడో వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే సీటు కోసం ఇప్పట్నుంచే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టాయంటేనే దాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఏదా ఎమ్మెల్సీ?
Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు.
KTR Tweet: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాధితుల పక్షాన పోరాడతామని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. బతుకమ్మ చీరలపై ప్రజలకు క్షమాపణలు చేయాల్సింది పోయి నేతన్నల పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం మొగోడే కాబట్టి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రజా పాలన అందిస్తున్నాడని ఆయన అన్నారు. కేటీఆర్ మాట్లాడే దురహంకార పొగరు మాటలను ప్రజలు చీత్కకరిస్తున్నా కూడా మారడం…
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర అని, ఫార్మాసిటీ వ్యవహారంలో ప్రభుత్వం పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా స్పష్టం చేయండని, కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని,…
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ తాతయ్య జోగినిపల్లి లక్ష్మి కేశవరావు జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బడి కట్టించాం… రాజకీయాలకతీతంగా గుడి పూర్తిచేసి గ్రామానికి అంకితం చేస్తామని ఆయన వెల్లడించారు. కొదురుపాకకు వస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని, మిడ్ మానేర్‌లో కొదురుపాక మునిగిపోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ…
తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ( సెప్టెంబర్ 26) సందర్భంగా వారందించిన పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అణిచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, అస్థిత్వ ఉద్యమంలో, స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో, పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనక నాటి వారి పోరాట…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు బయటికి ఎక్కువగా రావడం లేదు? ఎన్నికల తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించడం వెనకున్న అసలు రీజనేంటి? బయట జరుగుతున్న రకరకాల చర్చలకు మించిన మాస్టర్ ప్లాన్ ఉందా? నన్ను ఓడిస్తే... వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని గతంలో అన్న మాటల్ని నిజం చేస్తున్నారా? లేక సమయం ఉంది మిత్రమా.... అంత తొందరేల అంటున్నారా? అసలేం జరుగుతోంది?
BRS Working President: మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోంది.. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు.