Harish Rao : ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు
- ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు
- దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచింది
- 15వేలు రైతుబంధు అన్నాడు.. గుండు సున్నా చేశాడు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్ రావు మండిపడ్డారు. ముదిరాజ్, గంగపుత్రులంటే సీఎం రేవంత్ కు చిన్నచూపని, ఆగస్ట్ లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదన్నారు. మేము 100కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్ లో పెట్టిందె 16కోట్లు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. చేప పిల్లలు డబుల్ పోస్తామని చెప్పి.. ఇప్పుడు చేప పిల్లలు సగమే పోయాలని అంటున్నారన్నారు. చెరువులు నిండుకుండలా ఉన్నప్పటికీ.. చేప పిల్లల సగమే పోయాలంటున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటూ ఆయన సెటైర్ వేశారు.
Railway: రైలులో ప్రయాణించే రోగులకు రైల్వే ప్రత్యేక రాయితీ.. ఏ రోగులకు ఎంత రాయితీ తెలుసా..?
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
అంతేకాకుండా..’కాంగ్రెస్ ముఖ్యనేతల కోసం రీజల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు. ముఖ్యనేతల భూములున్నాయని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కొందరు స్వార్థం కోసం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చటం దారుణం. దీని వలన 16కిమీ దూరం పెరుగుతుంది. కేంద్రమే నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. దక్షిణ భాగాన్ని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామంటోంది. దీని వలన 20వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతాయి. కొందరు స్వార్థం కోసం ప్రజలపై 20వేల కోట్లు భారం పడుతుంది. రుణమాఫీకి పుట్టని అప్పు.. రింగ్ రోడ్ నిర్మాణానికి పుడుతున్నాయా? ఉత్తర భాగం 158కిమీ కేంద్రమే నిర్మిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10నెలలు అయినా కూడా ఉత్తర భాగం నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. రైతులకు మార్కెట్ రేటు ఇచ్చి భూసేకరణ చేయాలి’ అని హరీష్ రావు అన్నారు.
Russian-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!